Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రద్దీగా ఉన్న రోడ్డులో అంబులెన్స్‌కు చాకచక్యంగా దారి ఇచ్చి.. మానవత్వాన్ని చూపించిన వాహనదారులు!

  • అంబులెన్స్‌ వస్తోందని తెలుసుకుని తమ కార్లను నిలిపేసిన వాహనదారులు
  • అంబులెన్స్‌ కి దారి ఇవ్వడం కోసం తమ వాహనాలను పక్కకు జరిపిన మరికొందరు 
  •  ఐదు నిమిషాల్లో రోగి ఆసుపత్రికి తరలింపు
  • చైనాలో ఘటన
అంబులెన్స్‌కి దారి ఇవ్వాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా, కొందరు పట్టించుకోరు. దారి ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. అయితే, ఇటీవ‌ల‌ చైనాలోని జిన్హువా సిటీలో ర‌ద్దీగా ఉన్న ర‌హ‌దారిపై వాహ‌న‌దారులు అంబులెన్స్ కి క్షణాల్లో దారి ఇచ్చి అందరితో శ‌భాష్ అనిపించుకున్నారు. అంబులెన్స్ వస్తోందని తెలుసుకున్న వాహ‌న‌దారులు త‌మ కార్ల‌ను ఎక్కడికక్కడ ఆపేసి, అంబులెన్స్ కు చాలా చాక‌చ‌క్యంగా దారి ఇచ్చారు. దీంతో రోగిని ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బ‌యట‌‌కు వ‌చ్చింది. మీరూ చూడండి... 
China
cars
ambulance

More Telugu News